తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్​ ఫలితాలు రిలీజ్

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్​ ఫలితాలు రిలీజ్
  • ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు రిలీజ్
  • ఎస్ఎస్​సీలో 51.96%, 
  • ఇంటర్​లో 41.02% పాస్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో గతనెలలో  జరిగిన టెన్త్, ఇంటర్​ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. టెన్త్​లో 51.96%, ఇంటర్​లో 41.02% మంది పాసయ్యారు. గురువారం ఫలితాలను సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి రిలీజ్ చేశారు. టెన్త్​లో 31,720 మంది ఎగ్జామ్​ రాయగా, 16,481 మంది పాసయ్యారని, దీంట్లో రెగ్యులర్ 16,047 మంది, సప్లిమెంటరీ 434 మంది ఉన్నారని చెప్పారు. ఇంటర్​లో 36,345 మంది రాస్తే, 14,910 మంది ఉత్తీర్ణత సాధించారని, దీంట్లో  రెగ్యులర్ అభ్యర్థులు 10,819 మంది, సప్లిమెంటరీ 4,091 మంది ఉన్నట్టు  పేర్కొన్నారు. ఇంటర్​లో అత్యధికంగా  నాగర్​కర్నూల్​లో 55.36%,  నల్లగొండలో 55.34% మంది పాసయ్యారని, అత్యల్పంగా హైదరాబాద్​లో 26.33% మంది ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు. టెన్త్​లో అత్యధికంగా నల్లొండలో 87.62%, అత్యల్పంగా  జగిత్యాలలో 14.03% మంది పాసైనట్టు చెప్పారు. 26 నుంచి ఆగస్టు 5లోపు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్​కు అవకాశముందని తెలిపారు.