ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ఏఐ(OpenAI) భారతీయుల కోసం ఒక గొప్ప ప్రకటన చేసింది. బెంగళూరులో జరగనున్న ఓపెన్ఏఐ మొట్టమొదటి డెవలపర్స్ డే ఈవెంట్ సందర్భంగా నవంబర్ 4 నుండి లిమిటెడ్-పిరియడ్ అఫర్ కింద చాట్‌జిపిటి గో సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ChatGPT Go అంటే ఏమిటి:
ChatGPT Go అనేది OpenAI కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఇది హై మెసేజ్ లిమిటెడ్, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్స్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తుంది. అయితే తక్కువ సబ్‌స్క్రిప్షన్ ధరకు ChatGPT హై-ఎండ్ ఫీచర్‌లను ఎక్కువ మంది ఉపయోగించుకునేలా చేయడానికి దీనిని ఆగస్టు 2024లో భారతదేశంలో ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి నెలలోనే భారతదేశంలో ChatGPT సబ్‌స్క్రైబర్ల సంఖ్య రెట్టింపు కంటే పెరిగింది.
భారతదేశంలో AI వినియోగం : OpenAI ప్రకారం, భారతదేశం ఇప్పుడు ChatGPTకి రెండవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. డెవలపర్లు, విద్యార్థులు, నిపుణులతో సహా లక్షల మంది భారతీయ వినియోగదారులు ప్రతిరోజూ ChatGPTని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రమోషన్ ఇండియా ఫస్ట్ నిబద్ధతలో భాగమని, భారత ప్రభుత్వ ఇండియా AI మిషన్ చొరవను కూడా బలోపేతం చేస్తుందని OpenAI చెబుతోంది.
ఈ ఆఫర్ ఎవరికీ అంటే : నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ అఫర్ ప్రమోషనల్ కాలంలో ChatGPT Go కోసం సైన్ అప్ చేసుకునే వినియోగదారులు ఒక సంవత్సరం ఉచిత సేవను పొందుతారు. అయితే ఇప్పటికే ChatGPT Go సబ్‌స్క్రైబర్‌లుగా ఉన్న వినియోగదారులు కూడా 12 నెలల ఫ్రీ అఫర్ పొందొచ్చు.
