
OpenAI సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇండియాకు OpenAI కార్యకలాపాలు విస్తరించనుంది.ఈఏడాది చివరలో అంటే 2025 డిసెంబర్ లో భారత దేశంలో తొలి OpenAI ఆఫీస్ ను ప్రారంభిస్తామని స్వయంగా OpenAI సీఈవో ఆల్ట్ మన్ ప్రకటించారు.ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసేందుకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈఏడాది చివరలో న్యూఢిల్లీలో OpenAI ఆఫీస్ ను ప్రారంభిస్తామని సామ్ అల్ట్ మన్ Xలో పోస్ట్ షేర్ చేశారు. డిజిటల్ ఆవిష్కరణ, పెరుగుతున్న AI వినియోగానికి కేంద్రంగా భారత్ లో తన ఉనికిని బలోపేతం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓపెన్ఏఐ భారత్ లో నియామకాలను ప్రారంభించింది.
భారత్ లో OpenAI నియామకాలు..
Open AI నియామకాలు మూడు స్థాయిల్లోజరుగుతాయి. OpenAI భారత్ లో మూడు ఉద్యోగ ఖాళీలను జాబితా చేసింది. ఇందులో డిజిటల్ నేటివ్స్ కోసం ఖాతా డైరెక్టర్, లార్జ్ ఎంటర్‌ప్రైజ్ కోసం ఖాతా డైరెక్టర్ మరియు స్ట్రాటజిక్ కోసం ఖాతా డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి.
అకౌంట్ డైరెక్టర్, డిజిటల్ నేటివ్స్ పోస్టుకు దరఖాస్తుదారులు ప్లాట్‌ఫాం యాజ్-ఎ-సర్వీస్ లేదా సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ సొల్యూషన్‌లను సేల్స్, పునరుద్ధరించడంలో ఏడు సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉండాలి.
అకౌంట్ డైరెక్టర్, లార్జ్ ఎంటర్‌ప్రైజ్ పోస్టుకు అభ్యర్థులు ప్లాట్‌ఫాం -యాజ్-ఎ-సర్వీస్ లేదా సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ సొల్యూషన్‌లను సేల్ చేయడంలో పదేళ్లకు పైగా అనుభవం కలిగి ఉండాలి.
అకౌంట్ డైరెక్టర్, స్ట్రాటజిక్ పోస్టుకు దరఖాస్తుదారులు ఇలాంటి సేల్స్ పాత్రలలో పద్నాలుగు సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉండాలి.
ఆసక్తిగల అభ్యర్థులు OpenAI కెరీర్‌ల పేజీని సందర్శించి లొకేషన్‌ను భారతదేశానికి ఫిల్టర్ చేయవచ్చు. అక్కడ అందుబాటులో ఉన్న పోస్టులు కనిపిస్తాయి. దరఖాస్తుదారులు తమ రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేసేందుకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన వివరాలను అందించాలి.