ఇండియాలో ఓపెన్ఏఐ ఆఫీస్

ఇండియాలో ఓపెన్ఏఐ ఆఫీస్

న్యూఢిల్లీ:  ఏఐ టెక్నాలజీ కంపెనీ ఓపెన్​ఏఐ ఈ ఏడాది  ఢిల్లీలో ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. భారతదేశం చాట్‌‌జీపీటీకి అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్. విద్యార్థులు, నిపుణులు, డెవలపర్లు, వ్యాపారవేత్తలు తమ సమస్యల పరిష్కారానికి ఓపెన్​ఏఐ టూల్స్​ను వినియోగిస్తున్నారని పేర్కొంది. 

భారతదేశంలో ఏఐకి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్​ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌‌మన్ అన్నారు. ఇక్కడి ఏఐ డెవలపర్లకు అద్భుతమైన టెక్ నైపుణ్యం ఉందని, ప్రభుత్వం కూడా 'ఇండియాఏఐ' మిషన్ ద్వారా వారిని ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు. తమ ఆఫీసు ఏఐని అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందని పేర్కొంది.