OpenAI : ఢిల్లీలో చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐ ఆఫీస్.. ఉద్యోగుల రిక్రూట్మెంట్ స్టార్ట్..

OpenAI : ఢిల్లీలో చాట్‌జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐ ఆఫీస్.. ఉద్యోగుల రిక్రూట్మెంట్ స్టార్ట్..

చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ OpenAI త్వరలో భారతదేశంలో తన మొదటి ఆఫీసును రాజధాని ఢిల్లీలో ప్రారంభించబోతోంది. ఈ నిర్ణయం కంపెనీ భారత్ లో ఏఐ అభివృద్ధి ప్రతిపాదనలో కీలక స్థానం పొందేందుకు తీసుకున్న పెద్ద అడుగు. ఇండియా తమకు రెండవ అతిపెద్ద మార్కెట్ అని  ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ చెప్పారు. ఇక్కడ ChatGPT ఉపయోగిస్తున్నవారి సంఖ్య గత ఏడాది కంటే నాలుగింతలు పెరిగిందని వెల్లడించారు. 

ఢిల్లీలో కొత్త ఆఫీసు భారత ప్రభుత్వం కోరుకున్న IndiaAI మిషన్కు మద్దతుగా నిలుస్తుందని శామ్ ఆల్ట్మన్  స్పష్టం చేశారు.  "ఇండియా కోసం, ఇండియాతో కలిసి ఏఐని అభివృద్ధి చేయాలి" అనే లక్ష్యంతో తమ ఆఫీస్ ప్రారంభిస్తున్నామన్నారు. కంపెనీ ఇప్పటికే భారతదేశంలో ఒక లీగల్ ఎంటిటీని ఏర్పాటు చేసి.. అవసరమైన ఉద్యోగుల నియామకాలు మొదలుపెట్టిందని వెల్లడైంది. ఈ టీమ్ లోకల్ భాగస్వామ్యులు, ప్రభుత్వ, వ్యాపార సంస్థలు, విద్యావేత్తలతో సమన్వయం చేస్తూ ఏఐ అభివృద్ధి, వినియోగంలో సహకరిస్తుందని సీఈవో శామ్ ఆల్ట్మన్.

►ALSO READ | రైళ్లలో అదనపు లగేజీ ఛార్జీలపై క్లారిటీ.. అదంతా ఫేక్, ఆ ఆలోచనే లేదు: అశ్వినీ వైష్ణవ్

ఓపెన్ ఏఐ రాక స్థానికంగా కార్యకలాపాలు స్టార్ట్ చేయటం దేశ డిజిటల్ ఇన్నోవేషన్ లో మరిన్ని విజయాలకు దారితీస్తుందని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇదే క్రమంలో కంపెనీ భారతదేశ మార్కెట్ కోసం ప్రత్యేకంగా "ChatGPT Go" అనే సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ ప్రారంభించింది. ఇది నెలకు రూ.399తో అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఏఐ సాంకేతికతను మరింత ప్రజలకు చేరువుచేయడం లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది.