వందేమాతరం.. ఏం జరిగినా చూసుకుందాం

వందేమాతరం.. ఏం జరిగినా చూసుకుందాం

వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌తో పాటు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. సోమవారం టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో వైమానిక దాడులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘మన ఎయిర్ ఫోర్స్‌‌‌‌ను ఇంకొక దేశంలోకి పంపించడం అంటే.. అది వార్ ప్రకటించినట్లే’ అని మురళీ శర్మ వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తిరేపేలా  ఉంది.

‘ఇలా ప్రతీకారం తీర్చుకుంటూ పోతే దేశాలు ఉండవు.. బోర్డర్స్ మాత్రమే ఉంటాయి’ అనే డైలాగ్ ఆలోచింపజేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌‌‌‌ రుద్రగా వరుణ్ తేజ్ కనిపించగా, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ ఇంప్రెస్ చేస్తోంది. ‘శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌‌‌‌ది కూడా..

ఏం జరిగినా సరే చూసుకుందాం’ కూడా అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.  సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో  నిర్మిస్తున్న ఈ చిత్రం  ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.