‘ఓపెన్ హైమర్’లో ‘భగవద్గీత’కు అవమానం.. సినిమాను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు

‘ఓపెన్ హైమర్’లో ‘భగవద్గీత’కు అవమానం.. సినిమాను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఓపెన్ హైమర్’ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో భగద్గీత ప్రభావం చాలానే ఉంటుంది. సినిమాలో అది స్పష్టంగా కూడా కనిపిస్తుంది. మూవీ రిలీజ్ కు ముందు నుంచీ కూడా ఈ వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి తగ్గట్టుగానే సినిమాలో భగవద్గీత ప్రభావం సినిమాలో కనిపిస్తుంది. మూవీలోని ఒక సన్నివేశంలో ఫ్లోరెన్స్ పగ్ పాత్రధారి జీన్ టాట్‌ లాక్‌, ఓపెన్ హైమర్ మధ్య వచ్చే  శృంగార సన్నివేశంలో నటి భగద్గీత చదువుతున్నట్టుగా చూపించారు. ఇదే ఇప్పుడు వివాదానికి తెరలేపింది. దీనిపై కొన్ని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వివాదం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తుండగా.. దర్శకుడు నోలన్ తన సినిమాలో భగవద్గీత గురించి ప్రస్తావించడం బాగుంది, కానీ బోల్డ్ సన్నివేశాల్లో పవిత్రమైన భగవద్గీత గురించి చూపించడం సరికాదని అంటున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సన్నివేశాలను తొలగించాలని, మూవీని ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కేవలం ఒక్క బోల్డ్ సన్నివేశంలోనే భగవద్గీత ప్రస్తావన రాలేదు. సినిమాలో చాలా వరకూ భగవద్గీత ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా అయితే నిజ జీవితంలో కూడా ఓపెన్ హైమర్ భగవద్గీతతో పాటు పలు హిందూ పురాణ గ్రంథాలను చదివాడు. ఆయన సంస్కృత భాషను ఎక్కువగా ఇష్టపడేవాడట. అయితే తనని తాను ఎప్పుడూ హిందువుగా చెప్పుకోలేదని అంటారు. భగవద్గీతలోని ఓ శ్లోకం ఓపెన్ హైమర్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. అదే ఆయనలో పరివర్తనకు కారణం అయిందని చెబుతారు. మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కీలన్ మర్ఫీ కూడా సినిమాలో తన పాత్రకు సిద్ధమవుతున్న సమయంలో భగవద్గీత చదివినట్లు సమాచారం.