
హాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓపెన్ హెయిమర్(Oppenheimer). స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ(Cillian Murphy) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
దీంతో ఈ సినిమా టికెట్స్ కు ఇండియాలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందులో భాగంగా ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో ఓపెన్ హెయిమర్ సినిమా ఒక్కో టికెట్ ధర రూ.2450 గా నిర్ణయించారు. ముంబైలోని పివిఆర్ ఐమాక్స్ లోని ఒక్కో టికెట్ ధర ఈ రేంజ్ లో ఉంది. అంత ధర పెడితే ఎవరు కొంటారు అని అనుకోకండి.. ఇప్పటికే వీకెండ్ కు సంబందించిన అన్ని టికెట్స్ బుక్ అయిపోయాయి. ఈ ఒక్క రీజన్ చాలు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు ఇండియాలో క్రేజ్ ఏంటో చెప్పడానికి.
రిలీజ్ కు నాలుగు రోజుల ఉండగానే ఈ రేంజ్ డిమాండ్ చూసి ఆశ్చర్యపోతున్నాయి ఇండియన్ ట్రేడ్ వర్గాలు. అంతేకాదు ఇండియన్ స్టార్ హీరోల రేంజ్ లో ఈ సినిమాకు కూడా ఉదయం నాలుగు గంటల బెనిఫిట్ షోస్ కూడా వేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇక ఇవాన్నీ చూస్తుంటే ఈ సినిమా ఇండియాలో ఉన్న పాత రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు.. రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో కలెక్షన్ వస్తాయో చూడాలి.