
ఒప్పొ ఎఫ్31 సిరీస్ భారత్‌లో లాంచ్ అయ్యింది. ఇందులో ఒప్పొ ఎఫ్31 5జీ, ఎఫ్31 ప్రో 5జీ, ఎఫ్31 ప్రో+ 5జీ ఉన్నాయి. మూడు ఫోన్లలో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ ఓఐఎస్ కెమెరా ఉంది.
ఎఫ్31 5జీ ధర రూ.22,999 నుంచి ప్రారంభమ వుతుంది. ప్రో మోడల్స్ ధర రూ.26,999– రూ.30,999 మధ్య, ప్రో ప్లస్ ధర రూ.32,999–రూ.34,999 మధ్య ఉన్నాయి. సెప్టెంబర్ 19న ప్రో మోడల్స్, సెప్టెంబర్ 27న ఎఫ్31 5జీ అమ్మకాలు మొదలవుతాయి.