
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన ఒప్పో కే13 టర్బో ప్రో, ఒప్పో కే13 టర్బో స్మార్ట్‌ఫోన్లను ఒప్పో విడుదల చేసింది. గేమ్స్ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఇవి నిరోధిస్తాయి. ఒప్పో కే13 టర్బో ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 200 మెయిన్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
టర్బో వేరియంట్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, 12జీబీ వరకు ర్యామ్, 108 ఎంపీ మెయిన్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. ఒప్పో కే13 టర్బో ధర రూ. 32,999 నుంచి, ఒప్పో కే13 టర్బో ప్రో ధర రూ. 42,999 నుంచి ప్రారంభమవుతుంది.