హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ధరలో భారీ ఫీచర్లు, వేగంగా పనిచేసే మన్నికమైన ఫోన్ కావాలని కోరుకునే వాళ్ల కోసం ఒప్పో ఏ6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చింది. ఇందులో 6.7 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, వర్చువల్ ర్యామ్, 7000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 50 ఎంపీ మెయిన్ కెమెరా తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన ఫోటోలను తీస్తుంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు. సాధారణంగా మిడ్ రేంజ్ ఫోన్లు కొంత కాలం తర్వాత నెమ్మదిస్తాయి.
ఈ సమస్య లేకుండా దీర్ఘకాలం సాఫీగా పనిచేసేలా ఏ6 ప్రోను తయారు చేశారు. దీంతో రోజువారీ పనులు ఎంతో వేగంగా పూర్తవుతాయి. సోషల్ మీడియా వాడకం, వీడియోలు చూడటం, గేమింగ్ వంటి పనులను ఇది సులభంగా హ్యాండిల్ చేస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ఉంటుంది కాబట్టి ఫోన్ పొరపాటున కింద పడినా తట్టుకోగలదు.
నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ రేటింగ్ కూడా ఉంది. కళ్ళకు ఇబ్బంది కలగకుండా ఐ కంఫర్ట్ ఫీచర్లను చేర్చారు. ధరలు రూ.21 వేల నుంచి రూ.24 వేల వరకు ఉంటాయి. కొన్ని బ్యాంకు కార్డులతో కొంటే డిస్కౌంట్ పొందవచ్చు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి స్మార్ట్‌ఫోన్ అని ఒప్పో చెబుతోంది.
