ఒప్పో రెనో 14 5జీ దీపావళి ఎడిషన్ విడుదల

ఒప్పో రెనో 14 5జీ దీపావళి ఎడిషన్ విడుదల

స్మార్ట్​ఫోన్​ బ్రాండ్ ​ఒప్పో  రెనో 14 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్ ప్రత్యేక దీపావళి ఎండిషన్​ విడుదల చేసింది. దీని బ్యాక్​ ప్యానెల్​  రంగులను మార్చుకోగలుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్,  ఐదేళ్లపాటు ఓఎస్​అప్​డేట్స్​, 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.  8 జీబీ ర్యామ్+ 256 జీబీ వేరియంట్​ధర రూ.40 వేలు. కొన్ని కార్డులతో కొంటే రూ. 3,999 వరకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది.  రూ. 3,000 ఎక్స్చేంజ్​బోనస్​, 6 నెలల నో కాస్ట్​ఈఎంఐ అవకాశం కూడా ఉందని ఒప్పో తెలిపింది. 

మొదటి రెండు రోజుల్లోనే 38 కోట్లకు పైగా కస్టమర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్  ఫెస్టివల్  మొదటి రెండు రోజుల్లోనే 38 కోట్లకు పైగా కస్టమర్లు సంస్థ వెబ్​సైట్, యాప్​లను సందర్శించారు. వీరిలో 70 శాతం మంది చిన్న నగరాల వాసులేనని అమెజాన్​ తెలిపింది.  ఎస్​బీఐ డెబిట్ క్రెడిట్ కార్డులతో రూ. 260 కోట్లకు పైగా ఆదా చేశారు. జీఎస్టీ 2.0 వల్ల గృహోపకరణాలు, దుస్తులు, నిత్యావసరాల ధరలు తగ్గాయని,  16 వేల మందికిపైగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు (ఎస్​ఎం​బీలు) అమ్మకాలను మూడు రెట్లు పెంచుకున్నాయని అమెజాన్​ తెలిపింది. 

ఒలివా నుంచి జీన్​ ఐక్యూ 

వయసు మీరినా యవ్వనంగా కనిపించేలా చేసేందుకు జీన్​ఐక్యూ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు హైదరాబాద్​లోని ఒలివా క్లినిక్స్​ ప్రకటించింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి డీఎన్ఏ-ఆధారిత చికిత్స. చర్మం, జుట్టు శరీర సంరక్షణ కోసం ప్రతి వ్యక్తికి ప్రత్యేక నివారణ మార్గాలను అందిస్తారు. మందులు, ట్రీట్​మెంట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా చికిత్స చేస్తారు.   

రామ్‌‌‌‌రాజ్ కాటన్ నుంచి గ్రాండ్ ఫెస్టివ్ కలెక్షన్‌‌‌‌ 

పండుగ సీజన్ కోసం రామరాజ్ కాటన్, తన కొత్త ‘గ్రాండ్ ఫెస్టివ్ కలెక్షన్’ను ఆవిష్కరించింది. వివిధ వేడుకల కోసం సరిగ్గా సరిపోయే ప్రత్యేక ధోతీ-షర్ట్ సెట్లు ఇందులో ఉంటాయి. ఈ ప్రత్యేక కలెక్షన్లు స్కై బ్లూ, షటిల్ గ్రే, ఫ్రెష్ పీచ్, సాండ్ స్టోన్, కాపర్, గోల్డ్, మాస్ గ్రీన్, రోజ్ గోల్డ్ వంటి రంగుల్లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. 

జీఎస్‌‌‌‌టీ సంస్కరణలను  సామాన్యుడి కోసం తీసుకొచ్చామని అన్నారు.  బ్యాంకులు యువతలో నమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎస్‌‌‌‌ అండ్ పీ,  మార్నింగ్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ డీబీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్ ఐ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత క్రెడిట్ రేటింగ్‌‌‌‌ను ‘బీబీబీ’, ‘బీబీబీ+’కి పెంచినట్లు మంత్రి తెలిపారు. 

బ్యాంకులు వృద్ధికి ఇంధనంగా మారాలని అన్నారు. “బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  2024–25లో అత్యుత్తమ పనితీరు కనబరిచింది. దీని మొత్తం వ్యాపారం రూ.5.46 లక్షల కోట్లకు, డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌లు (అప్పులు) ఏడాది లెక్కన  35శాతం, ఎంఎస్‌‌‌‌ఎంఈ అడ్వాన్స్‌‌‌‌లు  5.65శాతం వృద్ధి సాధించాయి” అని మంత్రి వివరించారు.