హైదరాబాద్, వెలుగు:ఒప్పో ఇండియా తన సరికొత్త రెనో16, 16సీ ఫోన్లను హైదరాబాద్‌లో బుధవారం విడుదల చేసింది. వీటిలోని ఏఐ స్నాప్ కీతో ఏఐ మైండ్ స్పేస్, వాయిస్ నోట్స్, ట్రాన్స్‌లేటర్ వంటి టూల్స్‌ను ఒకే క్లిక్‌తో పొందవచ్చు. ఏఐ మైండ్ పైలట్ ఫీచర్ ద్వారా జెమిని, పర్‌ప్లెక్సిటీ, చాట్ జీపీటీ ఒకే స్క్రీన్‌పై ఉపయోగించుకోవచ్చు.
అంతేగాక ఏఐ బిల్ మేనేజర్, ఏఐ మెనూ ట్రాన్స్‌లేషన్, ఏఐ రికార్డింగ్ స్టిక్కర్ వంటి ఫీచర్లూ ఉన్నాయి. ఏఐ రీమిక్స్ కోలాజ్, పాప్ క్యామ్ వంటి ఏఐ టూల్స్ ద్వారా కంటెంట్ సృష్టించవచ్చు. ధరలు రూ.47 వేల నుంచి రూ.62 వేల వరకు ఉంటాయి. కొన్ని కార్డులతో కొంటే డిస్కౌంట్లు ఇస్తారు. వీటితో పాటు ఒప్పో బబుల్ (రూ.7,999), ఎన్కో ఎయిర్5 ఇయర్‌బడ్స్ (రూ.3,299) కూడా కంపెనీ విడుదల చేసింది.
