భూతగాదాలో భార్యభర్తల హత్య

భూతగాదాలో భార్యభర్తల హత్య

భూ తగాదా భార్యభర్తల ప్రాణాలను బలిగొంది. ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదంలో ప్రత్యర్థులు ఇద్దరు దంపతులను హతమార్చిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలం కిరిడిలో శుక్రవారం చోటుచేసుకుంది. శ్యాంరావు(55)కు తన ముత్తాత పేరిట వంద ఎకరాల భూము ఉంది. సర్వే నం.71, 86లో ఉన్న  తొమ్మిది ఎకరాల ఇతని భూమిని అత్త మారుబాయి అల్లుడు తెలంగ్​రావు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల శ్యాంరావు ఆ భూమి తనే సాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్యాంరావు, భార్య తారాబాయి(47), పెద్ద కొడుకు విలాస్‌‌తో కలిసి భూమిని దున్నేందుకు వెళ్లాడు. అదే సందర్భంలో తెలంగరావు చేను వద్దకు చేరుకొని దంపతులపై దాడి చేసి, గొడ్డలితో దారుణంగా నరికి పారిపోయాడు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు భార్యభర్తల మృతదేహాలు తరలించకుండా బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నిందితుడివెంట యశ్వంత్​రావు, జంగుబాయి, బొజ్జిరావు, శారద, గంగారాం ఉన్నారని బాధిత కుటుంబసభ్యుల ఆరోపించారు. వారందనికి అరెస్ట్​చేసే వరకు మృతదేహాలను తీసుకెళ్లనివ్వమని బైఠాయించారు. భూవివాదంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ ఈ హత్యలు జరిగాయన్నారు.