సాగు చట్టాలు, కనీస మద్దతు ధరపై చర్చ

సాగు చట్టాలు, కనీస మద్దతు ధరపై చర్చ

ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరుగుతున్న మీటింగ్ లో కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర రావు, వైసీపీ తరపున విజయసాయి రెడ్డి హాజరయ్యారు. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్ సహా పలు కీలక అంశాలను ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చిస్తున్నట్టు సమాచారం. శీతాకాల సమావేశాలు సజావుగా జరగడానికి ప్రతి సభ్యుడు సహకరించాలని కోరుతోంది కేంద్రం.