ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతోంది

ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతోంది

దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాశాయి. ఈడీ,  సీబీఐలను  కేంద్రం రాజకీయ ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పుతోందని తెలిపాయి. నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధించడంపైనా పార్లమెంటులో చర్చకు సర్కారు సిద్ధంగా లేదని రాష్ట్రపతి దృష్టికి విపక్షాలు తీసుకెళ్లాయి. నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా చర్చ జరపాలని కోరాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో కేంద్రం ఉందని పేర్కొన్నాయి. 

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము  జులై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రెండో మహిళా రాష్ట్రపతిగా, తొలి గిరిజన రాష్ట్రపతిగా ఆమె కొత్త చరిత్రను లిఖించారు.