ఎమోజీతో పిజ్జా ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అసలు ఎమోజీలు ఎలా పుట్టాయి, ఎలా వచ్చాయో తెలుసా ?

ఎమోజీతో పిజ్జా ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అసలు ఎమోజీలు ఎలా పుట్టాయి, ఎలా వచ్చాయో తెలుసా ?

బాస్ పంపిన వర్క్‌‌‌‌‌‌‌‌ అసైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌కి రిప్లైగా ఓ థంబ్స్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ ఎమోజీ, గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ని బతిమాలడానికి దండం పెడుతున్న ఎమోజీ, ఎవరికైనా యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ అయ్యిందని తెలియగానే ఏడుస్తున్న ఎమోజీ పంపిస్తుంటాం. ఇలా మనలోని సంతోషం, బాధ, ఆనందం, కోపం.. అన్ని భావాలను ఎమోజీల ద్వారానే చెప్తుంటాం. మన భాష తెలియని వాళ్లకు కూడా వీటితో మన ఫీలింగ్స్‌‌‌‌‌‌‌‌ని చెప్పొచ్చు. అందుకే ఇది యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. అంతెందుకు వాట్సప్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌ వాడేవాళ్లంతా మాటలకు బదులు ఈ ఎమోజీల ద్వారానే ఎక్కువగా కమ్యూనికేట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. ఇలా మన జీవితంలో భాగమైన ఎమోజీలు ఎలా పుట్టాయో.. మన జీవితాల్లోకి ఎలా వచ్చాయో తెలుసా? 

ఈ డిజిటల్ యుగంలో కమ్యూనికేషన్ ఇంతకుముందు కంటే వేగంగా, సులభంగా మారింది. ఆ క్రమంలో  టెక్ట్స్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌కి బదులుగా ఈజీగా మన భావాలను తెలిపేందుకు ఎమోజీలు వాడుకలోకి వచ్చాయి. అలా ఇప్పుడు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా మెసేజింగ్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లు వాడుతున్న వాళ్లలో దాదాపు 90 శాతం కంటే ఎక్కువమంది తమ ఆలోచనలను తెలియజేయడానికి ఎమోజీలనే వాడుతున్నారు. అందుకే 2014లో ఎమోజీపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్జ్ ప్రతి సంవత్సరం జూలై 17న ప్రపంచ ఎమోజీ డే నిర్వహించాలని ప్రతిపాదించాడు. అప్పటినుంచి ఈ డేని నిర్వహిస్తున్నారు.  

ఎలా పుట్టాయి? ప్రస్తుతం డిజిటల్ ‘కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌’లో ఎమోజీల వాడకం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ.. ఇవి లేకముందు మెసేజ్‌‌‌‌‌‌‌‌లో టెక్స్ట్ రాసేటప్పుడు వాడే ‘‘:-), :-–(., :), :], ;), ;-)” ఇలాంటి కొన్ని సింబల్స్‌‌‌‌‌‌‌‌తో ఫీలింగ్స్‌‌‌‌‌‌‌‌ని వ్యక్తపరచేవాళ్లు. ఈ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ 1980లలో మొదలైంది. మన దగ్గర కూడా సాధారణ కీప్యాడ్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్న టైంలో చాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసేటప్పుడు ఇలాంటి గుర్తులను వాడేవాళ్లు. అయితే.. 1999లో  జపాన్‌‌‌‌‌‌‌‌లో మొబైల్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ ‘ఎన్‌‌‌‌‌‌‌‌టీటీ డొకోమో’ ఐ-మోడ్ అనే మొబైల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చింది. మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్, ఇమెయిల్, ఇతర మల్టీమీడియా సేవలను యాక్సెస్ చేయడానికి తీసుకొచ్చిన సర్వీస్‌‌‌‌‌‌‌‌ ఇది. దీని కోసం జపనీస్ డిజైనర్ ‘షిగెటకా కురిటా’ మొదటిసారి ఒక ఎమోజీ సెట్‌‌‌‌‌‌‌‌ని రూపొందించాడు. వాటిని ఫీలింగ్స్‌‌‌‌‌‌‌‌, కొన్ని పనులను బొమ్మ రూపంలో తెలియజేయాలనే ఉద్దేశంతో తయారుచేశారు. అప్పడవి కేవలం జపాన్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. 

ప్రపంచమంతా..: జపాన్‌‌‌‌‌‌‌‌లో కొన్ని రోజుల్లోనే వీటి వినియోగం బాగా పెరిగిపోయింది. దాంతో గూగుల్‌‌‌‌‌‌‌‌లోని సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంటర్నేషనలైజేషన్‌‌‌‌‌‌‌‌ టీం ఎమోజీలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలి అనుకుంది. అందుకే ఎమోజీల గుర్తింపు కోసం ‘యూనికోడ్ కన్సార్టియం’లో పిటిషన్ వేసింది. ఇది కమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌ గాడ్జెట్స్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌లో వాడే ప్రామాణికమైన టెక్స్ట్, ఎమోజీలను నిర్ణయించే ఒక ఎన్జీవో సంస్థ. ఇది 2010లో ఎమోజీల వాడకానికి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2011లో ఆపిల్ వాటిని ఐఫోన్ కీబోర్డ్‌‌‌‌‌‌‌‌లో చేర్చింది. దాంతో ఎమోజీల వాడకం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. అయితే.. ఇప్పటికీ ఎవరు పడితే వాళ్లకు ఎమోజీలను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసే హక్కు లేదు. యూనికోడ్ కన్సార్టియం అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇందులో నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్, గూగుల్ లాంటి సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,800 కంటే ఎక్కువ ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి.

ఎమోజీతో పిజ్జా ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : డోమినోస్‌‌‌‌‌‌‌‌ డిజిటల్ ఆర్డరింగ్‌‌‌‌‌‌‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రచారం కోసం 2015లో ఎమోజీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చింది. దీని ద్వారా కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొన్ని సెకన్లలో పిజ్జా ఆర్డర్ చేయగలిగే వీలు కల్పించింది. తమ ఎక్స్‌‌‌‌‌‌‌‌(అప్పట్లో ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) హ్యాండిల్‌‌‌‌‌‌‌‌ను డొమినోస్ పిజ్జా ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌కు యాడ్‌‌‌‌‌‌‌‌ చేసే కస్టమర్లు  #EasyOrder లేదా పిజ్జా ఎమోజీని @Dominosకి ట్వీట్ చేస్తే చాలు. వెంటనే ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ అయ్యేది. ఆ తర్వాత డొమినోస్ ఆటోమెటెడ్‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్ మెసేజ్ ద్వారా ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ని పంపుతుంది. దాన్ని కస్టమర్‌‌‌‌‌‌‌‌లు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌ చేస్తే పిజ్జా డెలివరీ అయ్యేది. 

ఓ భాషగా: గతంలో ముఖ కవలికలు, వస్తువులు మాత్రమే ఎమోజీలుగా వాడేవాళ్లు. డిజిటల్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఫుడ్, వృత్తులు, సాంస్కృతిక పద్ధతుల వరకు ప్రతిదాన్ని సూచించే ఎమోజీలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఇవి భాష అడ్డంకులను అధిగమించే యూనివర్సల్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌గా మారాయి. మన భాష తెలియనివాళ్లతో కూడా ఈ ఎమోజీ భాషతో కొంతవరకు కమ్యూనికేట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. వాట్సప్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ లాంటి సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా యాప్‌‌‌‌‌‌‌‌ల్లో ప్రతిరోజూ బిలియన్ల కొద్ది ఎమోజీలు షేర్ అవుతున్నాయి. అంతేకాదు.. సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌లో  బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్స్‌‌‌‌‌‌‌‌ చేసే హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌లు, పోస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో, ప్రచారాల్లో ఎక్కువగా ఎమోజీలను వాడుతున్నారు.  2024లో వచ్చిన ఒక డేటా ప్రకారం.. ఎక్స్‌‌‌‌‌‌‌‌లో చేసే పోస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో ఎమోజీలు ఉంటే లేని వాటి కంటే 25.4 శాతం ప్రభావం చూపిస్తున్నాయి.  

ఇదే పాపులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : నవ్వుతూ ఏడుస్తున్నట్టు (ఫేస్ విత్ టియర్స్ ఆఫ్ జాయ్) ఉండే ఎమోజీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. దీన్నే జనాలు ఎక్కువగా సెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారట! ఏదైనా చాలా ఫన్నీగా లేదా హిల్లేరియస్‌‌‌‌‌‌‌‌గా అనిపించినా రిప్లైగా ఈ ఎమోజీని పంపుతున్నారు. దీని తర్వాత ఎక్కువగా రెడ్ హార్ట్, స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్-షేప్డ్ ఐస్ ఎమోజీలు పాపులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి.