ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేస్తే ..దారుణ మోసం

ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేస్తే ..దారుణ మోసం

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. వేలకు వేలు పెట్టి ఇష్టమైన వస్తువును కొనగోలు చేస్తున్న వినియోగదారులకు నిరాశ ఎదురవుతోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లిలో తక్కువ ధరకు ఫోన్ వస్తుందని ఆశపడ్డ యువకుడికి చుక్కెదురైంది. ఆన్ లైన్లో ఫోన్ ఆర్డర్ చేస్తే  సబ్బు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. 

కారేపల్లి గ్రామానికి చెందిన జగన్ ఈ నెల 12వ తేదీన మోసో అనే యాప్ లో నోకియా ఫోన్ ఆర్డర్ చేశాడు. ఈ ఫోన్ అసలు ధర రూ. 4340. అయితే ఆఫర్ లో రూ. 1000 కే  వస్తుందని ప్రకటన చూసి టెంప్ట్ అయి ఆర్డర్ చేశాడు. అయితే ఏప్రిల్ 18వ తేదీన సాయంత్రం జగన్ పేరుతో ఆర్డర్ చేసిన ప్యాకేజీ డెలివరీ అయింది. జగన్ ఇంట్లో లేకపోవడంతో అతని భార్య దాన్ని తీసుకుని ఓపెన్ చేసింది. అందులో సబ్బు కనిపించడంతో అవాక్కయింది. ఆ తర్వాత విషయాన్ని భర్త జగన్ కు తెలియజేయడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ఆ తర్వాత సబ్బుతో కూడిన ప్యాకెట్ ను రిటర్న్ చేశాడు. 

దీంతో బాధితుడు జగన్ ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్...సబ్బు ప్యాక్ ను తిరిగి తీసుకెళ్లాడు. అనంతరం జగన్ కు రూ. 1000 తిరిగి ఇచ్చాడు. ఆన్లైన్ మోసాలను అరికట్టే విధంగా సంబంధిత అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  జగన్ కోరారు.