
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రం లోని బీసీ బాయ్స్ హాస్టల్ లో ఎనిమిది రకాల కూరగాయల సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వార్డెన్ రేష్మా భాను ప్రత్యేక చొరవతో హాస్టల్ కాంపౌండ్ లోని ఖాళీ స్థలంలో చిక్కుడు, సొరకాయ, వంకాయ, టమాటా, బెండకాయ, అలచంద, దోసకాయ, అనపకాయ సాగు చేస్తున్నారు.
ఎలాంటి రసాయనాలు వేయకుండా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తుండడం విశేషం. ఈ పంటలన్నీ ఇప్పుడు కాత దశలో ఉన్నాయి. కూరగాయల సాగుతో పాములు, ఇతర క్రిమికీటకాల బెడద లేకుండా డజను వరకు కోళ్లను సైతం పెంచుతుండడం విశేషం.