
- సాయంత్రానికి వెలువడనున్న ఫలితాలు
- సత్యపాల్రావు, విక్రమ్రావు మధ్యే తీవ్ర పోటీ
కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్జరగనుంది. కార్మిక శాఖ అధికారులు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కంపెనీలోని 257 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగిం చుకోనున్నారు. పోలింగ్ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. సాయంత్రానికి విజేతను ప్రకటిస్తారు. కంపెనీలో గుర్తింపు పొందిన ఐదు సంఘాల తరఫున అభ్యర్థులు బరిలో నిలవాల్సి ఉంది. కానీ ఓరియంట్ సిమెంట్అండ్వర్కర్స్ఫెడరేషన్నుంచి కె.సత్యపాల్రావు, ఓరియంట్సిమెంట్కార్మిక సంఘం నుంచి పి.విక్రమ్రావు మాత్రమే పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్కు చెందిన రెండు గ్రూపుల తరఫున పోటీ చేస్తుండడంతో ఎన్నికలు ఆసక్తిగా, ఉత్కంఠగా మారాయి.
ఇరువర్గాలు ఎవరికి వారే ప్రచారం చేశారు. ఓటుకు భారీగా రేటును నిర్ణయించడంతో ఓటర్ల పంట పండుతుంది. ఎవరికి వారే ప్రత్యేక శిబిరాలకు తరలించి విందు, వినోదాలు కల్పించినట్లు తెలిసింది. ఉత్కంఠతతో జరిగే ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
150 మంది పోలీసులతో బందోబస్తు
ఎన్నికల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా బెల్లంపల్లి ఏసీపీ ఏ. రవికుమార్ఆధ్వర్యంలో పోలీసులు రూట్మార్చ్ను నిర్వహించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నలుగురు సీఐలు, 12 మంది ఎస్ ఐలతో పాటు ఏఎస్ ఐలు, నాలుగు ప్రత్యేక పోలీసు పార్టీలు కలిపి మొత్తం150 సిబ్బందిని బందోబస్తుకు నియమించారు.