ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భావం & వ్యవస్థాపకులు

ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భావం & వ్యవస్థాపకులు

1943, మే 26న హైదరాబాద్ రెడ్డి హాస్టల్​లో జరిగిన సమావేశంలో నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భవించింది. 

వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులు: మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు, బూర్గుల రంగనాథరావు. 

ఈ సంస్థ ముఖ్య లక్ష్యాలు: ప్రజల్లో మాతృభాషాభిమానం పెంచాలి. ఉత్తమ రచనలకు బహుమానాలు అందించాలి. గ్రామాల్లో రాత్రిపూట బడులు నిర్వహించి అక్షరాస్యత పెంచాలి.

ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదటి మహాసభ: 1943లో రెడ్డి హాస్టల్​లో జరిగింది. లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షత వహించారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి వార్షికోత్సవ సభ 1944లో వరంగల్​లో జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించాడు. 
1949లో నిజాం రాష్ట్ర అనే పదం తొలగించి ఆంధ్ర సారస్వత పరిషత్తుగా మారింది. ఈ సారస్వత పరిషత్ పండిత సారస్వతం, ప్రజా సారస్వతం, బాల సారస్వతం అనే మూడు రకాల గ్రంథాలను ప్రచురించింది. 

పండిత సారస్వతంలో భాగంగా ప్రచురించిన గ్రంథాలు
సూర్యనారాయణశాస్త్రి – కావ్యాలంకార సంగ్రహం
బూర్గుల రామకృష్ణారావు – సారస్వత వ్యాస ముక్తావళి
దివాకర్ల వెంకట అవధాని – సాహిత్య సోపానాలు, ఆంధ్ర వాగ్మయ చరిత్ర
రాల్లపల్లి అనంత కృష్ణశాస్త్రి – శాలివాహన గాథా, సప్తశతిసారం

ప్రజా సారస్వతంలో భాగంగా ప్రచురించిన గ్రంథాలు
సురవరం ప్రతాపరెడ్డి – ఆంధ్రుల సాంఘిక చరిత్ర
నెలటూరి వెంకయ్య – ఆంధ్రుల చరిత్ర
కృష్ణశాస్త్రి– పల్లెపదాలు, స్త్రీల పౌరాణిక పాటలు 

బాల సారస్వతంలో భాగంగా ప్రచురించిన గ్రంథాలు
దేవులపల్లి రామానుజరావు – మనదేశం
గడియారం రామకృష్ణరావు – వీరగాథలు
ఆదిరాజు వీరభద్రరావు – మిఠాయి చెట్టు
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన పత్రిక 

– ఆంధ్రశ్రీ.