
జీవశాస్త్రం పరిధి చాలా విస్తృతమైంది. జీవుల ఉద్భావన లక్షణాలు వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ ఇలా ఎన్నో కోణాల నుంచి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బయోలజీ శాఖలపై కనీస అవగాహన ఉండాలి.
జంతుశాస్త్రం: వివిధ జీవరాసుల నిర్మాణం, అలవాట్లు, ఆవాసాల వర్గీకరణ అధ్యయనశాస్త్రం
వృక్షశాస్త్రం: మొక్కల నిర్మాణం, పెరుగుదల, వ్యాధుల అధ్యయన శాస్త్రం.
శరీర ధర్మశాస్త్రం: జీవుల శరీర నిర్మాణాలు, అవి పనిచేసే విధానాల అధ్యయన శాస్త్రం.
సూక్ష్మజీవశాస్త్రం: కంటికి కనపడని జీవులు ( బ్యాక్టీరియా, వైరస్ మొదలైనవి) అధ్యయనశాస్త్రం.
మానవ అభివృద్ధిశాస్త్రం: ప్రాచీన, ఆధునిక మానవుల జీవన విధానాల అధ్యయనం.
జీవసాంకేతిక శాస్త్రం: జన్యుపరమైన అంశాలు, కొత్త వంగడాలు, మందుల ఉత్పత్తి వివరించే శాస్త్రం.
శిలాజశాస్త్రం: వృక్ష, జంతు సంబంధ శిలాజాల గురించి అధ్యయనశాస్త్రం.
జన్యుశాస్త్రం: జన్యువుల నిర్మాణం, వాటి సంశ్లేషణ, అనువంశికత, ఉత్పరివర్తనాల అధ్యయనశాస్త్రం.
వర్గీకరణశాస్త్రం: వృక్ష, జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరణ అధ్యయన శాస్త్రం.
జీవావరణశాస్త్రం: జీవులు అవి నివసించే ఆవరణానికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
రోగలక్షణ శాస్త్రం: వివిధ రకాల వ్యాధులు, కారణాలు, నిర్ధారణ గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
పరిణామ శాస్త్రం: జీవుల పరిణామ క్రమం గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
వ్యవసాయ శాస్త్రం: పంటల ఉత్పత్తి, నేల యాజమాన్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
ఆప్తమాలజీ: కన్ను నిర్మాణం, కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం.
ఆటాలజీ: చెవి నిర్మాణం, చెవికి సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం.
రైనాలజీ: ముక్కు నిర్మాణం, ముక్కుకు సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రం
న్యూరాలజీ: నరాల గురించి అధ్యయనం చేసేది.
ట్రైకాలజీ: వెంట్రుకలకు సంబంధించిన అంశాల గురించి అధ్యయనం చేసేది.
ఆర్ధ్రాలజీ: కీళ్లకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసేది.
మయాలజీ: కండరాలకు సంబంధించిన అంశాల గురించి తెలుసుకునేది.
డెర్మటాలజీ: చర్మం, చర్మ సంబంధిత వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
హిమటాలజీ: రక్తం నిర్మాణం తదితర అంశాల గురించి తెలుసుకునేది.
ఎంజియాలజీ: రక్తనాళాలకు సంబంధించిన విషయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
నెఫ్రాలజీ: మూత్రపిండాల నిర్మాణం గురించి తెలిపేది.
యూరాలజీ: మూత్రం, మూత్రాశయం సంబంధిత అంశాల గురించి అధ్యయనం చేసేది.
హెపటాలజీ: కాలేయం సంబంధిత వివరాల గురించి తెలుసుకునేది.
పల్మనాలజీ: ఊపిరితిత్తుల అధ్యయనం గురించి తెలిపే శాస్త్రం.
ఎండోక్రైనాలజీ: అంతస్రావిక గ్రంథులు, హార్మోన్ల గురించి తెలుసుకునే శాస్త్రం.
ఒడింటాలజీ: దంతాలకు సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
కార్డియాలజీ: గుండె నిర్మాణ, వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
అంకాలజీ: క్యాన్సర్ కణితి గడ్డలు మొదలైన వాటిపై అధ్యయనం చేసే శాస్త్రం.
ఇమ్యునాలజీ: శరీరంలో రోగ నిరోధక శక్తికి సంబంధించిన అధ్యయన శాస్త్రం.
డెండ్రాలజీ: చెట్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
పోమాలజీ: పండ్ల గురించి వివరించే శాస్త్రం.
ఫ్లోరికల్చర్: పుష్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
టాక్సికాలజీ: విష పదార్థాలపై అధ్యయనం చేసేది.
జెరెంటాలజీ: వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
కాలాలజీ: మానవ సౌందర్యం గురించి వివరించేది.
హిప్నాలజీ: నిద్ర గురించి తెలిపేది.
హైడ్రోఫోనిక్స్: నేల సహాయం లేకుండా మొక్కలు పెంచడం వివరించే శాస్త్రం.
ఫినాలజీ: పక్షుల వలసల గురించి వివరించేది.
హార్టికల్చర్: తోటల పెంపకం గురించి వివరించే శాస్త్రం.