
ప్రతిష్టాత్మిక ఆస్కార్ అవార్డు వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీని తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ వేడుకలకు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా రెడీ అయి వచ్చారు. అమెరికాలోని లాస్ ఏంజెన్స్ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకలకు ఈ ఇద్దరు హీరోలు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు.ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు. నాటునాటుతో పాటుగా మరో నాలుగు పాటలు ఆస్కార్ బరిలో ఉన్నాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీ పడుతోంది. కాగా ఇప్పటివరకు ఇండియాకు 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇందులో ఏఆర్ రెహమాన్ ను వరుసగా రెండు సార్లు ఆస్కార్ వరించింది. జయహో పాటకు రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు.