బషీర్ బాగ్, వెలుగు : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని ఖండిస్తూ ఉస్మానియా హాస్పిటల్‌లోని జూనియర్ డాక్టర్లు శనివారం నిరసన తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని మెడికల్ కాలేజీ వద్ద క్యాండిల్స్‌తో నివాళి అర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థిని డాక్టర్ నాగసాయి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు తీసుకురావాలని కోరారు.
అలాగే అబిడ్స్ లోని ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ముందు డాక్టర్లు, సిబ్బంది శనివారం నిరసన తెలిపారు. ట్రైనీ డాక్టర్ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్స్ప్రదర్శన నిర్వహించారు. ఉదయ్ ఓమ్ని ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ రాఘవ దత్తు, డాక్టర్ ఉదయ్ ప్రకాశ్‌తోపాటు అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ మేరీ
డాక్టర్లత పాల్గొన్నారు. అలాగే గమన్ హాస్పిటల్డాక్టర్లు సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో హాస్పిటల్మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నంద కిషోర్ పాల్గొని మాట్లాడారు. హాస్పిటల్ డైరెక్టర్లు భాస్కర్ రావు, ఇందీవర్ రెడ్డి, డాక్టర్లు లవకుమార్ రెడ్డి, భరత్, తిరుపతి పాల్గొన్నారు.
