
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ కాలేజ్‌కు చెందిన కే. మనీష్ గౌడ్ ట్రిపుల్ గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటాడు. సోమవారం జరిగిన మెన్స్ 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో మనీష్ 38.20 సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలిచి స్వర్ణం నెగ్గాడు. అతిఫ్ ముజామిల్ (అన్వర్ ఉలుమ్, 39.59 సె), జ్వాలా తనయ్ సింగ్ (భద్రుకా కాలేజ్, 41.76 సె) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను గెలిచారు. మెన్స్ 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లోనూ మనీష్ (1:29.17 సె) తొలి స్థానంతో గోల్డ్‌ను సాధించాడు.
అతిఫ్ ముజామిల్ (1:38.17 సె), హరీష్ (అంబేద్కర్ కాలేజ్, 1:42.87 సె) వరుసగా రజతం, కాంస్యం సొంతం చేసుకున్నారు. మెన్స్ 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో మనీష్ 3:36.06 సెకన్ల టైమింగ్‌తో మూడో గోల్డ్‌ను గెలిచాడు. సయ్యద్ లతీఫుద్దీన్ (ఐఎస్‌ఎల్ ఇంజనీరింగ్, 4:55.07 సె), అతిఫ్ ముజామిల్ (5:42.99 సె) తర్వాతి రెండు ప్లేస్‌ల్లో నిలిచారు. మెన్స్ 50 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో కార్తీక్ (తపస్య కాలేజ్, 32.47 సె), అమిత్ (భద్రుకా కాలేజ్, 35.25 సె), యూసుఫ్ ఉజైర్ (కేశవ్ మెమోరియల్, 43.81 సె) వరుసగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.