రేపటి నుంచి ప్రారంభం కానున్న జేఎన్ టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న జేఎన్ టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు

డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై హైకోర్టులో విచారణ ముగిసింది. విచారణ సందర్భంగా చివరి సెమిస్టర్ కు ఎప్పటిలాగే రాత పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం కోర్టుకు విన్నవించుకుంది.

అటానమస్ కాలేజీలు వారికి అనుకూలమైన రీతిలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని, సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్ గా పాసైనట్లుగా పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్ట్ స్పందిస్తూ..పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని,ఆ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

అయితే సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడించాలని న్యాయవాది దామోదర్ రెడ్డి కోర్ట్ ను కోరారు.

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్ట్ చెప్పగా..తాము రెండు నెలల్లో నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్ కోర్టుకు విన్నవించుకుంది. దీంతో పరీక్షలను కరోనా జాగ్రత్తలతో నిర్వహించాలని హైకోర్ట్ తీర్పించింది.

కాగ రేపటి నుంచి జేఎన్ టీయూహెచ్, ఎల్లుండి ఓయూ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.