ఓటీపీ ఫ్రాడ్ ముఠా ఆటకట్టు

ఓటీపీ ఫ్రాడ్ ముఠా ఆటకట్టు

‘కేవైసీ అప్ డేట్ చేస్తాం’ అంటూ కాల్ చేసి ఎంతోమందిని బురిడీ కొట్టించారు. ‘నేను బ్యాంక్ కస్టమర్ కేర్ ఆఫీసర్ ను.. మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ చెప్పండి’ అంటూ ఎంతోమందిని దగా చేశారు. క్రెడిట్ కార్డులు జారీ చేస్తామంటూ  మోసాలకు పాల్పడ్డారు. ఇటువంటి వరుస చీటింగ్ లకు తెగబడిన జార్ఖండ్ రాష్ట్రంలోని జాంతారా ప్రాంతానికి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హైదరాబాద్ లోనే ఈ ముఠాపై 50 కేసులు ఉండగా.. రాచకొండ, సైబరాబాద్ తో పాటు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 263 కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేసుల దర్యాప్తులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్పెషల్ టీం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పీటీ వారెంట్ పై అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.