ఓటీటీ కంటెంట్​ బాగా చూస్తున్నరు

ఓటీటీ కంటెంట్​ బాగా చూస్తున్నరు
  • ఖాళీ ఉంటే ఫోన్​కు అతుక్కుపోతున్నరు
  • ఓటీటీ కంటెంట్​ బాగా చూస్తున్నరు

హైదరాబాద్​, వెలుగు: ఈతరం యువత ఖాళీ సమయాల్లో   ఫోన్‌‌తో ఎక్కువ సమయం గడుపుతోందని, అమెజాన్​ ప్రైమ్​, నెట్​ఫ్లెక్స్​ వంటి ఓటీటీల్లో కంటెంట్ చూసేందుకే ఆసక్తి చూపిస్తోందని వే2న్యూస్ సర్వేలో వెల్లడైంది. రోడ్ ట్రావెల్ రెండో స్థానంలో ఉండగా, ఇన్-స్టోర్ షాపింగ్​కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. సర్వే ప్రకారం 63.36 శాతం మంది ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారు. వీరిలో 51శాతం మంది వీడియోలు, 29శాతం మంది ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నారు. ప్రజల ఇష్టాయిష్టాలను తెలుసుకునేందుకు ఏపీ, తెలంగాణలో ఈ సర్వే నిర్వహించారు. ఇప్పుడు దేశంలో కోవిడ్ ఆంక్షలు లేవు. దీంతో అందరూ తిరిగి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50.71శాతం మంది తమ సొంత బండ్లలో ప్రయాణం చేస్తున్నారు.   రైళ్ల వైపు 26శాతం మంది ఆసక్తి చూపగా, బస్సుల్లో వెళ్తామని కేవలం 14శాతం  మంది చెప్పారు. 31శాతం మంది ఆన్‌‌లైన్‌‌తో పాటు ఆఫ్‌‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నట్లు చెప్పగా 29.5శాతం మంది వస్తువులను ఆఫ్‌‌లైన్ స్టోర్లలో తమ కళ్లతో చూసి కొంటున్నారు.