నాలుగు కథలు.. రివ్యూలు

నాలుగు కథలు.. రివ్యూలు

టైటిల్​ : లస్ట్‌ స్టోరీస్‌2

డైరెక్షన్​ : ఆర్. బాల్కి, కొంకణా సేన్ శర్మ, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, సుజోయ్ ఘోష్
కాస్ట్ : మృణాల్‌ ఠాకూర్‌, విజయ్‌ వర్మ, తమన్నా, కాజోల్‌, అంజుమన్‌ సక్సేనా, తిలోత్తమ షోమీ, అంగద్‌ బేడి, కుముద్‌ మిశ్రా, నీనా గుప్త, అమృత సుభాష్​
లాంగ్వేజ్ : హిందీ, ప్లాట్​ ఫాం :  నెట్‌ఫ్లిక్స్‌

పెళ్లికి ముందే.. : వేద (మృణాల్‌ ఠాకూర్‌), అర్జున్‌ (అంగద్‌ బేడీ) లకు పెండ్లి ఫిక్స్​ అవుతుంది. రెండు కుటుంబాలు మాట్లాడుకునేటప్పుడు వేద బామ్మ (నీనా గుప్తా) మధ్యలో కలగజేసుకుని వాళ్లు లైఫ్​లాంగ్​ హాయిగా ఉండాలంటే.. పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి ఉండాలని చెప్తుంది. తర్వాత ఏం జరిగింది? అనేది సిరీస్​ చూసి తెలుసుకోవాలి. 
పనిమనిషి ఏం చేస్తుంది?: ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో ఉద్యోగం చేస్తుంటుంది. ఒక రోజు తలనొప్పి రావడంతో మధ్యలోనే ఆఫీస్​ నుంచి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి చూసేసరికి  పనిమనిషి సీమ (అమృత సుభాష్‌) తన భర్తతో ఉంటుంది. అప్పటి నుంచి ఇషిత కొన్నాళ్లు వాళ్లను గమనిస్తుంటుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
పదేళ్ల కిందటి ప్రేమ: విజయ్‌ చౌహాన్‌ (విజయ్‌ వర్మ) ఒక కంపెనీ సీఈవో. అతని భార్య అనిత (ముక్తి మోహన్‌) ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటాడు. ఒక రోజు తన లవర్​ నిషా (జెన్నీఫర్‌)తో ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తుండగా యాక్సిడెంట్​ అవుతుంది. దాంతో కారును అక్కడే వదిలేసి మెకానిక్‌ కోసం పక్కనే ఉన్న ఊళ్లోకి వెళ్తాడు. అక్కడే అతడికి తన మాజీ భార్య శాంతి (తమన్నా) కనిపిస్తుంది. ఆమె పదేండ్ల క్రితం విజయ్​తో విడిపోయింది? వాళ్లు విడిపోవడానికి కారణాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. 
ఒకటి అనుకుంటే మరోటి: దేవయాని (కాజోల్)కి కొడుకుని ఇంగ్లాండ్ పంపించి చదివించాలని కోరిక. ఆమె భర్త (కుముద్ మిశ్రా) ప్రతి రోజూ తాగొచ్చి గొడవ పడుతుంటాడు. అదే టైంలో వాళ్లింట్లో పని మనిషిని మిశ్రా ఇష్టపడతాడు. ఆ విషయం తెలిసి దేవయాని ఏం చేసింది? అనేదే కథ. 
2018లో హిట్​ అయిన ‘లస్ట్‌ స్టోరీస్‌’  వెబ్​సిరీస్​కు సీక్వెల్​గా దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా నాలుగు పార్ట్స్​ ఉన్నాయి. ఒక్కో పార్ట్​ని ఒక్కో డైరెక్టర్​ తెరకెక్కించారు. ఇందులో రకరకాల మనుషుల్ని చూడొచ్చు. అందరూ బాగానే నటించారు. బలమైన కథలు ఉన్నాయి. కానీ.. వాటిలో లస్ట్‌ కాస్త ఎక్కువైంది. డైరెక్షన్​ మీద కూడా ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది.
 

మోటార్​ సౌండ్

టైటిల్​ : గుడ్ నైట్
డైరెక్షన్​ : వినాయక్ చంద్రశేఖరన్
కాస్ట్ : కె.మణికందన్, మీతా రఘునాథ్, రమేశ్ తిలక్, రేచల్ రెబెక్కా, బాలాజీ శక్తివేల్, లాంగ్వేజ్ : తమిళం​, తెలుగు
ప్లాట్​ ఫాం :  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మోహన్ (మణికందన్)కు గురక సమస్య ఉంటుంది. అందుకే అతన్ని అందరూ మోటార్​ మోహన్​ అని పిలుస్తుంటారు. అతని గురక వల్ల వాళ్ల అమ్మ, అక్క, బావ, చెల్లి అందరూ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి టైంలో అను (మీరా రఘునాథ్​) పరిచయం అవుతుంది. మోహన్‌ని పెళ్లి చేసుకుంటుంది. కానీ.. అతని గురక వల్ల ప్రతి రోజూ ఇబ్బంది పడుతుంటుంది. గురక సమస్య తగ్గించుకునేందుకు మోహన్ ఏం చేశాడు? అది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
ఫస్టాఫ్​ బాగానే అనిపిస్తుంది. కానీ.. సెకండాఫ్​ కాస్త సాగదీసినట్టు ఉంది. మోహన్​ రోల్‌లో మణికందన్​ బాగా నటించాడు. అను రోల్​లో చేసిన మీరా రఘునాథ్​ కూడా మెప్పించింది. కామెడీతోపాటు సెంటిమెంట్​ బాగుంది. 

ట్రయాంగిల్​ లవ్​

టైటిల్​ : ఇష్క్ నెక్స్ట్ డోర్ సీజన్ 1
డైరెక్షన్​ : అఖిలేష్ వాట్స్
కాస్ట్ : అభయ్ మహాజన్, నటాషా భరద్వాజ్, మృణాల్ దత్, గోపీ దేశాయ్, పూరవ్ ఝా
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ ఫాం :  జియో సినిమా

రజత్ విహార్ అనే చిన్న కాలనీలో కథ నడుస్తుంది.  ఈ కాలనీలోనే దేవ్ మిశ్రా (అభయ్ మహాజన్), మెహెర్ సిక్కా (నటాషా భరద్వాజ్) ఉంటారు. పక్క పక్కనే ఉన్నా ఇద్దరికీ పరిచయం ఉండదు. కొన్నాళ్లకు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారుతుంది. కానీ.. వాళ్లు ఒకరికొకరు ప్రపోజ్​ చేసుకోకముందే మెహెర్​ ఎక్స్​ బాయ్‌ఫ్రెండ్​ అశ్విన్ చౌహాన్ (మృణాల్ దత్) వీళ్ల మధ్యలోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?కథ చాలా సాదాసీదాగా ఉన్నా పెద్దగా బోర్​ కొట్టించదు. కొన్ని సీన్లు బాగా నవ్వు తెప్పిస్తాయి. లవ్‌ ట్రాక్​ బాగుంది. కానీ.. కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనిపించింది.
 

టైటిల్​ : ఇష్క్ నెక్స్ట్ డోర్ సీజన్ 1

డైరెక్షన్​ : అఖిలేష్ వాట్స్
కాస్ట్ : అభయ్ మహాజన్, నటాషా భరద్వాజ్, మృణాల్ దత్, గోపీ దేశాయ్, పూరవ్ ఝా
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ ఫాం :  జియో సినిమా

రజత్ విహార్ అనే చిన్న కాలనీలో కథ నడుస్తుంది.  ఈ కాలనీలోనే దేవ్ మిశ్రా (అభయ్ మహాజన్), మెహెర్ సిక్కా (నటాషా భరద్వాజ్) ఉంటారు. పక్క పక్కనే ఉన్నా ఇద్దరికీ పరిచయం ఉండదు. కొన్నాళ్లకు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారుతుంది. కానీ.. వాళ్లు ఒకరికొకరు ప్రపోజ్​ చేసుకోకముందే మెహెర్​ ఎక్స్​ బాయ్‌ఫ్రెండ్​ అశ్విన్ చౌహాన్ (మృణాల్ దత్) వీళ్ల మధ్యలోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?కథ చాలా సాదాసీదాగా ఉన్నా పెద్దగా బోర్​ కొట్టించదు. కొన్ని సీన్లు బాగా నవ్వు తెప్పిస్తాయి. లవ్‌ ట్రాక్​ బాగుంది. కానీ.. కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనిపించింది.