శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్స్. ఇటు ఓటీటీలో కొత్త సినిమాలతో సందడి సందడిగా కనిపిస్తాయి. ఇక ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్ధమయ్యాయి. మరి ఈవారం ఓటీటీలో వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూదాం.
ముందుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ లో వచ్చిన బ్రో మూవీ ఆగస్టు 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక బ్రహ్మాజీ కొడుకు సంజయ్ కుమార్ హీరోగా వచ్చిన స్లమ్‌డాగ్ హజ్బెండ్ కూడా ఆగస్టు 25 నుండి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది. ఇక ఈ ఇయర్ క్లాసిక్ హిట్ గా నిలిచినా బేబి మూవీ కూడా ఆహాలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తమిళ మూవీ పిజ్జా 3 కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.