హైకోర్టుకు చేరిన రాహుల్ గాంధీ సభ ఇష్యూ

 హైకోర్టుకు చేరిన  రాహుల్ గాంధీ సభ ఇష్యూ

హైదరాబాద్: ఓయూలో రాహుల్ గాంధీ సభ ఇష్యూ హైకోర్టుకు చేరింది. రాహుల్ సభకు అనుమతి కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ వేసింది ఓయూ జేఏసీ. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓయూ వైస్ చాన్స్ లర్, ఓయూ రిజిస్ట్రార్ ను ప్రతివాదులుగా చేర్చింది. పిటిషన్ పై రేపు వాదనలు జరగనున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులతో రాహుల్ గాంధీ  ఇంటరాక్ట్ అవుతారని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. ఈ మీటింగ్ లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు ఉండబోవన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశమే లేదని కోర్టుకు వివరించారు. అధికార పార్టీ ఒత్తిడి వల్లే సభకు అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. ఠాగూర్ ఆడిటోరియంలో సభకు అనుమతిఇచ్చేలా వీసీని ఆదేశించాలని కోర్టును కోరారు.

తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 6న సాయంత్రం 4 గంటలకు రాహుల్‌గాంధీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ సభకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో 2 వేదికలు ఏర్పాటు చేయనున్నారు. రాహుల్, ముఖ్య నేతలకు ఒక వేదిక...రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక ఉండనుంది. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగించున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

సినీ కళాకారులంతా తెలంగాణ బిడ్డలే

ఓయూ నేతల పరామర్శకు వెళ్లిన జగ్గారెడ్డి అరెస్ట్