కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఓయూ ఓల్డ్ విద్యార్థిని పడిగాపులు

 కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఓయూ ఓల్డ్ విద్యార్థిని పడిగాపులు

సీఎం కేసీఆర్ను కలిసేందుకు  ఓయూ ఓల్డ్ స్టూడెంట్, టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్, ఉద్యమకారిణి దాత్రికా స్వప్న  దేశ రాజధాని ఢిల్లీలో పడిగాపులు కాస్తోంది. గత రెండు రోజులుగా కేసీఆర్ను కలిసేందుకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ కార్యాలయం ముందు వెయిట్ చేస్తోంది. హైదరాబాద్లోని ప్రగతీ భవన్లో కేసీఆర్ను  కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న సమాచారాన్ని తెలుసుకుని..ధాత్రికా స్వప్న హస్తినకు వెళ్లింది. అక్కడ కూడా కేసీఆర్ ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.

ఉద్యమకారులకు అన్యాయం..
ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ధాత్రికా స్వప్న ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారిణిగా తనకుమంచి పేరుందని చెప్పారు. విశిష్ట ఉద్యమకారిణిగా కేసీఆర్ అవార్డు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అవకాశం కల్పిస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని.... ఆ మాట నిలబెట్టుకోవాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చానని స్పష్టం చేశారు. 

ఉద్యమకారులకు సాయం ఎందుకు చేయరు..
కేసీఆర్ను కలిసేందుకు ఢిల్లీకి వస్తే..ఆయన సెక్యూరిటీ సిబ్బంది బూతులు తిడుతున్నారని ధాత్రికా స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టరేట్ చదివిన అనేకమంది విద్యావంతులు తెలంగాణలో నిరుద్యోగులుగా ఉన్నారని..వారికి కేసీఆర్ అవకాశం కల్పించాలని కోరారు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాలాంటి ఉద్యమకారులకు ఎందుకు సహాయం చేయరని ధాత్రికా స్వప్న  ప్రశ్నించారు. ఏది ఏమైనా సరే..సీఎం కేసీఆర్ను కలిసేంత వరకు ఢిల్లీలోనే ఉంటానని స్పష్టం చేశారు.