
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. రాత్రి సమయంలో బాత్రూంకు వెళ్లిన ఓ అమ్మాయికి గుర్తు తెలియని వ్యక్తి ఇబ్బందులకు గురి చేశాడు. బాత్రూంలో ఉండగా..ఒక ఆగంతకుడి మాటలు వినపడగా ఆమె భయంతో బాత్రూం గడియ పెట్టుకొని లోపలే ఉండి పోయింది. ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో.. ఆగంతకుడు ఆమె ఉన్న బాత్రూం లోపలికి దూకి, కత్తి చూపి, అమ్మాయిని ఆరవొద్దని బెదిరించాడు. బాత్రూం నుండి బయటికి తీసుకొచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా అరవడంతో మిగిలిన గదులలోని అమ్మాయిలు బయటికి రావటంతో, వారిని కూడా బెదిరించాడు. ఆ తర్వాత మొదటి అంతస్తు నుండి కిందికి దూకి పారి పోయాడు.
పారిపోయిన వ్యక్తి బాధిత విద్యార్థిని గది నుండి సెల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళాడు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘాటన స్థలానికి చేరుకొని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వారిని పిలిపించి దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ వెనక కాంపౌండ్ వాల్ దగ్గర పగిలిపోయి ఉన్న బాధితురాలి సెల్ ఫోన్ దొరికింది. లేడీస్ హాస్టల్స్ లో ముందు భాగంలో మాత్రమే CCTV కెమెరాలు ఉన్నాయని అంతటా ఏర్పాటు చేయాలని అమ్మాయిలు కోరారు.