వ్యాక్సిన్ తయారీకి మన దేశం హబ్‌గా మారింది

వ్యాక్సిన్ తయారీకి మన దేశం హబ్‌గా మారింది
  • ఎవరూ భయపడొద్దు.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి

కరోనా వైరస్‌కు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. తిలక్ నగర్ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజలెవరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. ‘ఈ రోజు 140 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నాం. శానిటేషన్,హెల్త్ వర్కర్స్‌కు నేటి నుంచి వ్యాక్సిన్ వేస్తున్నాం. ఎవరూ భయం పడోద్దు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రజాప్రతినిధులకు కాకుండా ప్రధాని ఆదేశాల మేరకు వారు చెప్పిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నాం. వ్యాక్సిన్ల తయారీకి మన దేశం ఒక హబ్‌గా మారింది. అందులో హైదరాబాద్‌కు కూడా స్థానం ఉంది. కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాక్సిన్ అందరిలో విశ్వాసం పెంచుతుంది. ఈ రోజు 30 మందికే వ్యాక్సిన్ ఇస్తున్నాం, కానీ రేపటి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ జరుగుతుంది. గడిచిన పది నెలలుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు’ అని ఆయన అన్నారు.

For More News..

తొలి టీకా నేను అందుకే తీసుకోలేదు

రాష్ట్రంలో తొలి టీకా వేసుకున్న సఫాయి కార్మికురాలు

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

గుండెపోటుతో పాండ్యా తండ్రి మృతి