లాభాల్లోకి వచ్చినం.. స్విగ్గీ సీఈఓ వెల్లడి

లాభాల్లోకి వచ్చినం.. స్విగ్గీ సీఈఓ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్విగ్గీ  లాభాల్లోకి వచ్చిందని కంపెనీ సీఈఓ ప్రకటించారు. మార్చితో ముగిసిన ఏడాదికి గాను ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిందని వెల్లడించారు. ఆపరేటింగ్ ఖర్చులు ఎక్కువగా ఉండడం, కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లను  ఇస్తుండడంతో ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ కంపెనీలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు మినహాయించి, అన్ని కార్పొరేట్ ఖర్చులను కలుపుకున్నాక స్విగ్గీ లాభాల్లోకి వచ్చిందని కంపెనీ సీఈఓ శ్రీహర్ష మాజేటి ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.

ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విధానాలను స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అమలు చేయడంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. హర్ష ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ స్పందించారు. ‘కంగ్రాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాగా చేశారు’ అని రిప్లై పెట్టారు. కానీ, స్విగ్గీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది మాత్రం హర్ష మాజేటి ప్రకటించలేదు.  మా ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పార్టనర్లందరికీ అనేక ప్రయోజనాలను అందిస్తూనే ఈ మైలురాయిని చేరుకోగలిగాం. కస్టమరే ముందు అన్న తమ ప్రాథమిక రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు పనిచేస్తున్నామని, ఇండస్ట్రీలోనే బెస్ట్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నామని అన్నారు. పాత కస్టమర్లు మళ్లీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నారని, రిటెన్షన్ రేటు బాగుందని వెల్లడించారు. రెస్టారెంట్ పార్టనర్లతో తమ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి బాగా పనిచేస్తోందని వివరించారు..