మన కొత్త సెక్రటేరియట్ డిజైన్.. మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ లెక్కనే!

మన కొత్త సెక్రటేరియట్ డిజైన్.. మలేషియా ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ లెక్కనే!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ఓకే చేసిన కొత్త సెక్రటేరియట్ డిజైన్ మలేషియా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ‘పెర్డానా పుత్ర’ ప్యాలెస్ లెక్కనే ఉంది. సీఎం అయిన కొత్తలో మలేషియా టూరుకు పొయిన కేసీఆర్.. అప్పట్లో ఆ ప్యాలెస్ ముందు ఫొటో కూడా దిగారు. మలేషియాలోని కౌలాలంపూర్ ద‌గ్గర్లో పుత్రజయ సిటీలో ఈ ఆఫీసు ఉన్నది. చూడ్డానికి అందంగా, విశాలంగా ఉంటుంది. పుత్రజయకు వెళ్లే టూరిస్టులు ఆ ప్యాలెస్ను సందర్శించి ఫొటోలు దిగుతుంటరు. 2014 ఆగస్టు మూడో వారంలో సీఎం కేసీఆర్,మంత్రి ఈటల, కొందరు ఎమ్మెల్యేలు మలేషియా టూర్ కు పొయినప్పుడు ‘పెర్డానా పుత్ర’ ప్యాలెస్ ముందు నిలబడి ఫొటో దిగారు. ఆ డిజైన్, ఆర్కిటెక్చర్ సీఎం కేసీఆర్ కు బాగా నచ్చి ఉంటుందని, అందుకే కొత్త సెక్రటేరియట్ అట్లనే కడ్తున్నరని అంటున్నరు.

‘పెర్డానా పుత్ర’ బిల్డింగ్ మలయ్, ఇస్లామిక్, యురోపియన్ నిర్మాణ శైలి కలిపి ఉంటది. 1997లో మొదలుపెట్టి రెండేండ్లలో కట్టారు. దానితో పోలిస్తే మన కొత్త సెక్రటేరియట్ డిజైన్ తో కొద్దిపాటి మార్పులు ఉన్నయి. పెర్డానా ప్యాలెస్ లో ఆరు ఫ్లోర్లు ఉన్నయి. ఐదో ఫ్లోర్ లో ప్రైమ్మినిస్టర్ ఆఫీసు ఉంటది. మన కొత్త సెక్రటేరియట్ కు 7 ఫ్లోర్లడిజైన్ ఉంది. ముందు ఆరు ఫ్లోర్ల‌తోనే కట్టాలనుకున్నా తర్వాత ఏడు అంతస్తులకు పెంచారు. ఇక పైన డోమ్ డిజైన్, టైల్స్, ఎలివేషన్, ఫినిషింగ్లలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.

సెక్రటేరియట్ ముందు ఫొటో దిగాలె..

‘ఎవరైనా విదేశీయులు వస్తేకొత్త సెక్రటేరియట్ ముందు నిలబడి ఫొటోలు దిగాలె. .’ అని సీఎం కేసీఆర్ ప‌లుమార్లు అన్నారు. అలాంటిది తాను మలేషియాలో నిలబడి ఫొటో దిగిన బిల్డింగ్ తరహాలోనే.. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ క‌డుతుండటం గమనార్హం. ఆ బిల్డింగ్లో ఏమేం ఉన్నాయో (సెమినార్హాళ్లు, వీఐపీ వెయిటింగ్రూములు, డెలిగేషన్రూమ్స్, భారీ పార్కింగ్ ఏరియావంటివి). అదే తరహాలో అన్ని సౌకర్యాలు మన కొత్త సెక్రటేరియట్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..