
న్యూఢిల్లీ : పేటెంట్లను మంజూరు చేయడంలో ఇండియా టాప్ 10 దేశాల్లో ఉందని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయెల్ అన్నారు. దేశంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) సెగ్మెంట్ ఎలా వృద్ధి చెందిందో ఆయన వివరించారు. 2023–24 లో సుమారు లక్ష పెటెంట్లను ఇష్యూ చేశామన్నారు. 2013– 2014 లో కేవలం 6 వేల పేటెంట్లు మాత్రమే ఇష్యూ అయ్యాయని పేర్కొన్నారు. ప్రతీ ఆరు నిమిషాలకు ఒక పేటెంట్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఫైల్ అవుతోందని వివరించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ ఇనీషియేటివ్‌లను తీసుకొచ్చిందని అన్నారు. జెమ్స్ అడ్ జ్యువెలరీ సెక్టార్‌లో స్కిల్స్ మెరుగుపరిచేందుకు ప్రతి ఏడాది 1,600 ఫ్రెషర్లకు కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) లో ట్రెయినింగ్ ఇస్తామన్నారు. కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామని, కంపెనీలు వాడుకోవాలన్నారు.