బీజింగ్‌లో కరోనా టెన్షన్‌: 1200 ఫ్లైట్లు క్యాన్సిల్‌

బీజింగ్‌లో కరోనా టెన్షన్‌: 1200 ఫ్లైట్లు క్యాన్సిల్‌
  • ఒక్క రోజులో 31 కేసులు నమోదు
  • చాలా చోట్ల లాక్‌డౌన్‌

బీజింగ్‌: చైనాలో పూర్తి కంట్రోల్‌కి వచ్చిందని అనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. చైనా రాజధాని బీజింగ్‌ను వణికిస్తోంది. బుధవారం ఒక్కరోజే 31 కేసులు నమోదు కావడంతో అధికారులు బీజింగ్‌ను క్లోజ్‌ చేశారు. చాలా చోట్ల లాక్‌డౌన్‌ విధించారు. బీజింగ్‌ ఎయిర్‌‌పోర్ట్‌లను క్లోజ్‌ చేశారు.1255 ఫ్లైట్లను క్యాన్సిల్‌ చేసినట్లు పీపుల్స్‌ డైలీ రిపోర్ట్ చెప్పింది. బీజింగ్‌కు రావాల్సిన 70 పర్సెంట్‌ ఫ్లైట్‌ ట్రీపులు క్యాన్సిల్‌ అయ్యాయి. స్కూళ్లను కూడా క్లోజ్‌ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మీడియం – హై రిస్క్‌ ఏరియాల నుంచి వచ్చే వారిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. బీజింగ్‌ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు న్యూక్లీ యాసిడ్‌ టెస్టులు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. బీజింగ్‌ నుంచి చైనాలోని ఇతర ప్రావిన్స్‌లకు వెళ్లిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దాదాపు కంట్రోల్‌లోకి వచ్చేసిందనుకున్న వైరస్‌ మళ్లీ మొదలైందని, పరిస్థితి ఆందోళన కరంగా ఉందని బీజింగ్‌ అధికార ప్రతినిధి జీ హిజీయన్‌ చెప్పారు. జీన్‌ ఫడి మార్కెట్‌ లింక్‌లను ట్రేస్‌ చేస్తూ టెస్ట్‌ చేస్తున్నామని అన్నారు.

మార్కెట్లు క్లోజ్‌

బీజింగ్‌లో నమోదవుతున్న కేసులన్నీ జీన్‌ ఫడి మార్కెట్‌తో లింక్‌ అయి ఉండటంతో బీజింగ్‌లోని 11 మార్కెట్లను అధికారులు క్లోజ్‌ చేశారు. మార్కెట్‌తో లింక్‌ ఉన్న ప్రతి ఒక్కరికి మాస్‌ టెస్టులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. వారంలో రోజుల్లో 137 మంది వ్యాధి బారిన పడ్డారని, వారిలో చాలా మందికి లక్షణాలు లేకుండానే వ్యాధి సోకిందని అన్నారు. స్పోర్ట్స్‌, గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. మాస్కులు కంపల్సరీగా వాడాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు.