ఇండియాలో ఐదేండ్లలో 2 లక్షల కంపెనీలు బంద్‌‌.. కారణం ఇదే..!

ఇండియాలో ఐదేండ్లలో 2 లక్షల కంపెనీలు బంద్‌‌.. కారణం ఇదే..!

ఇండియాలో ఐదేండ్లలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని కేంద్రం లోక్‌‌సభలో తెలిపింది. విలీనాలు, రద్దు వంటి కారణాలతో ఇవి మూతపడ్డాయి. కంపెనీల చట్టం లా ప్రకారం వ్యాపారం చేయని 1.85 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌‌ను ప్రభుత్వం రద్దు చేసింది.

వ్యాపారం చేయని 1.8 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కేంద్రం 

న్యూఢిల్లీ: భారతదేశంలో గత ఐదేళ్లలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌‌‌‌సభలో తెలిపింది.  విలీనాలు,  రద్దు వంటి కారణాలతో ఇవి క్లోజ్​ అయ్యాయి.   కంపెనీల చట్టం 2013 ప్రకారం వ్యాపారం చేయని సుమారు 1.85 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌‌‌‌ను  ప్రభుత్వం రద్దు చేసింది.  2024–25లో 20,365, 2023–24లో 21,181, 2022–23లో 83,452, 2021–22లో 64,054, 2020–21లో 15,216 కంపెనీలు మూతపడ్డాయి.   

మూతపడిన సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. 2021–22 నుంచి ఇప్పటివరకు 1,85,350 కంపెనీలు అధికారిక రికార్డుల నుంచి తొలగించామని,  వీటిలో 2022–23లోనే 82,125 కంపెనీలు తొలగించామని అన్నారు. కాగా, "షెల్ కంపెనీ" అనే పదానికి కంపెనీల చట్టంలో నిర్వచనం లేదు.  అయినప్పటికీ  వీటి వలన మనీలాండరింగ్‌‌‌‌ జరగకుండా చూసేందుకు  కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 

వీటి నిధుల దుర్వినియోగంపై సమాచారం వచ్చినప్పుడు సంబంధిత ఏజెన్సీలకు పంచుతామని మల్హోత్రా  తెలిపారు. ట్యాక్స్ సిస్టమ్‌‌ను   ఈజీగా మార్చడం ద్వారా ఈజ్‌‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌ను  పెంచాలని ప్రభుత్వ టార్గెట్ పెట్టుకుందని  ఆయన స్పష్టం చేశారు.