రూల్స్ ఫాలో కాలేదని.. 23 లక్షల అకౌంట్లను బ్లాక్​ చేసిన ట్విటర్​

రూల్స్ ఫాలో కాలేదని.. 23 లక్షల అకౌంట్లను బ్లాక్​ చేసిన ట్విటర్​

రూల్స్​ఫాలో కాకపోతే చర్యలు తప్పవు అంటోంది ట్విటర్. నిబంధనలు పాటించని యూజర్లపై ఆ సంస్థ కఠినంగా వ్యవహరిస్తోంది. అందుకనుగుణంగా ఏకంగా దాదాపు 24 లక్షల మంది అకౌంట్లను బ్లాక్​ చేసింది. 

ఈ విషయాన్ని కంపెనీనే స్వయంగా వెల్లడించింది. జూన్, జులై నెలల్లో  రికార్డు స్థాయిలో 23 లక్షల 95 వేల అకౌంట్లను బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. లైంగిక, అశ్లీలత సంబంధించిన కంటెంట్​ఉన్న ఖాతాలే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు వివరణ ఇచ్చింది. 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న 1 వెయ్యి 772 అకౌంట్లను బ్లాక్​ చేసినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ కి అనుగుణంగా ట్విటర్​చర్యలు చేపడుతోంది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యూజర్లపై తీసుకున్న చర్యలు, వారి కంప్లెంట్స్ పై చూపించిన పరిష్కారాలను వివరిస్తూ ప్రతి నెల ట్విటర్​ రిపోర్టులు రిలీజ్​ చేస్తోంది.