
- బీజేపీ ఎంపీ రఘునందన్ ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ ను తెలంగాణలోనూ అమలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. 3,182 మంది ఎస్సీలు, 2,027 మంది ఎస్టీలు, 9,178 మంది మహిళలు రుణాలు పొందారని వెల్లడించింది. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చేందుకు ఈ స్కీమ్ను అమలు చేస్తున్నామని వివ రించారు.
ఈ స్కీం అమలులో భాగంగా 2016 నుంచి ఈ ఏడాది మార్చి వరకు తెలంగాణలో 14,387 మంది ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకు రూ.3,352.61 కోట్ల రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. కాగా, హైదరాబాద్ కు డ్రైపోర్టు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. తెలంగాణ వంటి ఎగుమతుల ఆధారిత రాష్ట్రానికి ఇది పెద్ద ఊపిరిలా ఉంటుందని అభిప్రాయపడ్డారు.