శాలరీపై ఓవర్ డ్రాఫ్ట్ లోన్

శాలరీపై ఓవర్ డ్రాఫ్ట్ లోన్
  • ఓవర్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌ లోన్‌‌ తీసుకోవచ్చా!
  • ఇన్‌‌స్టంట్‌‌గా అమౌంట్‌‌.. రీపేమెంట్‌‌ చేయడం సులభం
  • విత్‌‌డ్రా చేసుకున్న అమౌంట్‌‌ పైనే వడ్డీ
  • ప్రాసెసింగ్‌‌ ఫీజు, పెనాల్టీ, అధిక వడ్డీలను భరించాలి

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: అర్జెంట్‌‌‌‌గా డబ్బులు అవసరమా? అప్పు దొరకడానికి టైమ్‌‌‌‌ పడుతోందా? శాలరీ అకౌంట్ అయితే, ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంకులు వెంటనే అప్పు ఇస్తాయి. దీనినే శాలరీ ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ అంటున్నారు. కానీ, శాలరీ అకౌంట్‌‌‌‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫెసిలీటీని బ్యాంకులు ఆఫర్ చేయవు. ఈ ఫెసిలిటీ కోసం అప్లయ్ చేసుకున్న వారి అర్హతను, క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తాయి. ఆ తర్వాత ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ అకౌంట్‌‌‌‌ను ఇస్తాయి.  ఈ అకౌంట్‌‌‌‌ను ఓపెన్ చేసేటప్పుడు వన్‌‌‌‌ టైమ్ ప్రాసెసింగ్ ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. అంతేకాకుండా ఈ ఫెసిలిటీని రెన్యువల్ చేసుకోవలనుకున్నా ఫీజు కట్టాల్సిందే. ఈ ఫెసిలిటీ ద్వారా ఎంప్లాయి నెట్ శాలరీ అమౌంట్‌‌‌‌ లేదా అంతకు మూడు రెట్లు అమౌంట్‌‌‌‌ను బ్యాంకులు అందిస్తాయి. కొన్ని బ్యాంకులు నెట్ శాలరీలో 90 శాతం వరకు మాత్రమే ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ను ఇస్తాయి. ఆర్థికంగా అనుకోని అవసరాలు వస్తే ఈ క్రెడిట్ ఫెసిలిటీ సాయపడుతుందని పైసాబజార్‌‌‌‌‌‌‌‌ డాట్‌‌‌‌ కామ్‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ షాహిల్‌‌‌‌ అరోరా అన్నారు. అకౌంట్లలో డబ్బులు లేకపోయినా, చెక్, ఈఎంఐ, సిప్‌‌‌‌ వంటివి ఫెయిల్ అవ్వకుండా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉపయోగపడుతుందని చెప్పారు. 

బ్యాంకు బట్టి లోన్ అమౌంట్‌‌‌‌..
ఓవర్ డ్రాఫ్ట్‌‌‌‌పై బ్యాంకును బట్టి వేరువేరు ఎలిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఎంత వరకు ఓవర్ డ్రాఫ్ట్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ను ఇవ్వాలో అకౌంట్‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌ క్రెడిట్ హిస్టరీని బట్టి బ్యాంకులు నిర్ణయిస్తున్నాయి. నెట్‌‌‌‌ శాలరీ ఎక్కువగా ఉన్నా, క్రెడిట్ ఇచ్చే అమౌంట్‌‌‌‌ను బ్యాంకులు తగ్గించేయొచ్చు. బారోవర్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ బట్టి కొన్ని బ్యాంకులు రూ. 3–5 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్‌‌‌‌ క్రెడిట్‌‌‌‌ ఇస్తుండగా, మరికొన్ని రూ. 1–1.5 లక్షల వరకు క్రెడిట్‌‌‌‌ను ప్రొవైడ్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులయితే కేవలం రూ. 10,000–25,000 వరకు మాత్రమే ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ను ఇస్తున్నాయని బ్యాంక్‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌ డాట్ కామ్‌‌‌‌ సీఈఓ అధిల్‌‌‌‌ శెట్టీ అన్నారు. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌  నెట్‌‌‌‌ శాలరీకి మూడు రెట్లు వరకు , సిటీ బ్యాంక్ సువిధా శాలరీ అకౌంట్‌‌‌‌ రూ. 5 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్‌‌‌‌ను ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. యూనియన్ బ్యాంక్‌‌‌‌ యూనియన్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ శాలరీ అకౌంట్ హోల్డర్స్‌‌‌‌ కింద నెట్‌‌‌‌ శాలరీలో 90 శాతం వరకు (మ్యాక్సిమమ్‌‌‌‌ రూ. 25,000 వరకు) ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ క్రెడిట్‌‌‌‌ను ఇస్తోంది. 

వడ్డీ ఎక్కువే..
క్రెడిట్ కార్డు మాదిరే  ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ లోన్స్‌‌‌‌పై కూడా అధికంగా వడ్డీ పడుతుంది. బ్యాంక్‌‌‌‌ను బట్టి నెలకు 1–3 శాతం వరకు, ఏడాదికి 12 –30 శాతం వరకు వడ్డీ పడుతుంది. కానీ, ఓవర్ డ్రాఫ్ట్ కింద మంజూరు అయినా అమౌంట్‌‌‌‌పై కాకుండా, కేవలం విత్‌‌‌‌డ్రా చేసుకున్న అమౌంట్‌‌‌‌పై మాత్రమే ఈ వడ్డీ ఉంటుంది. ‘ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్‌‌‌‌ మిస్‌‌‌‌ అయితే పెనాల్టీలు వంటివి ఉంటాయి. ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌ లోన్‌‌‌‌ కొంచెం ఖరీదైన లోన్‌‌‌‌. క్రెడిట్‌‌‌‌కార్డులు ఇచ్చే బెనిఫిట్స్‌‌‌‌, రివార్డులు, ఎక్స్‌‌‌‌క్లూజివ్ ఆఫర్లను  ఓవర్‌‌‌‌‌‌‌‌డ్రాఫ్ట్‌‌‌‌ లోన్స్ ఇవ్వవు. అంతేకాకుండా ప్రతి నెల క్రెడిట్ కార్డుపై దొరికే ఇంట్రెస్ట్‌‌‌‌ ఫ్రీ పీరియడ్‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ ఫెసిలిటీలో ఉండదు’ అని బ్యాంక్‌‌‌‌బజార్‌‌‌‌‌‌‌‌ సీఈఓ అధిల్‌‌‌‌ శెట్టీ అన్నారు. మరోవైపు ఓవర్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ లోన్‌‌‌‌ను తిరిగి చెల్లించడం చాలా సులువు. మొత్తం లోన్ అమౌంట్‌‌‌‌ను ఒకేసారి చెల్లించొచ్చు. లేదా కొంత ముందు కట్టి మిగిలింది తర్వాత కట్టొచ్చు. ఈఎంఐ వంటి ఆప్షన్‌‌‌‌ ఉండదని గుర్తుంచుకోవాలి.