5 రాత్రులు నిద్రపోకుండా లైవ్ గేమ్ చైనా స్టూడెంట్ మృతి

5 రాత్రులు నిద్రపోకుండా లైవ్ గేమ్ చైనా స్టూడెంట్ మృతి

బీజింగ్ :  ఓ స్టూడెంట్ తన కోర్సులో భాగంగా వరుస గా 5 రాత్రులు నిద్రపోకుండా లైవ్ స్టీమింగ్​లో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌‌లో చోటుచేసుకుంది.  లి హావో అనే యువకుడు తన ఫ్రెండ్స్​తో కలిసి జెంగ్జూ సిటీ​లో అద్దెకుంటున్నాడు.  హెనాన్స్ పింగ్‌‌డింగ్‌‌షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కాలేజీలో పైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్న్‌‌షిప్​ కోసం ఓ మీడియా సంస్థలో చేరాడు. 

ఇందులో భాగంగా లి హావో 26 రోజుల్లో 240 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ గేమింగ్ చేయాల్సి ఉంటుంది.  ఈ నెల 5 నుంచి లి హావో నైట్ షిఫ్ట్‌‌కి మారాడు. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల దాకా వరుసగా 5 రాత్రులు పనిచేశాడు. దీంతో ఈ నెల 10న రూమ్​ లో చలనం లేకుండా పడిపోయిన లి హావోను అతడి ఫ్రెండ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, లిహావో అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.