మున్సిపోల్స్ ముందు ఓవైసీ, కేసీఆర్ మత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. రాజకీయ లబ్ధికోసమే NRC పై ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసుల అనుమతి లేకుండానే నిజామాబాద్ లో ర్యాలీ తీశారని…ఇప్పుడు సీఎం అండతో సభను ఏర్పాటు చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మతపరమైన ర్యాలీలు ఎలా తీస్తారని ప్రశ్నించారు. మతసామరస్యాన్ని కాపాడాలని, రేపటి ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వొద్దంటూ నిజామాబాద్ కలెక్టర్, కమిషనర్ కు లేఖలు రాశారు.

