మిలాద్‌‌‌‌ ఉన్‌‌‌‌ నబీ ప్రదర్శనలకు అనుమతివ్వండి

 మిలాద్‌‌‌‌ ఉన్‌‌‌‌ నబీ ప్రదర్శనలకు అనుమతివ్వండి
  • సీఎం రేవంత్ రెడ్డికి ఒవైసీ సోదరులు, మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యుల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా సెప్టెంబర్‌‌ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు కలిసి, విజ్ఞప్తి చేశారు. 

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుందని, వాటికి పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.