రాజకీయాలు, దేశ సంపద హిందూ అగ్రవర్ణాల దగ్గరే: ఒవైసీ

రాజకీయాలు, దేశ సంపద హిందూ అగ్రవర్ణాల దగ్గరే: ఒవైసీ

దేశ సంపద అంతా హిందూ అగ్ర వర్ణాల దగ్గరే ఉందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజకీయాలు, సంపద కొందరి గుత్తాధిపత్యంలోనే ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఓ సర్వే ఆధారంగా దేశ సంపదలో వివిధ వర్గాల షేర్‌ ఎలా ఉందన్నది చెప్పారాయన.

ముస్లింలు జనాభా 12 శాతం ఉంటే వారి దగ్గర దేశ సంపదలో 8 శాతమే ఉందని చెప్పారు ఒవైసీ. ఎస్పీ, ఎస్టీలు కలిపి 27 శాతం జనం ఉంటే సంపద 11.3 శాతం ఉందన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో 35.66 శాతం ఉన్న బీసీల దగ్గర 31 శాతం సంపద ఉందని చెప్పారు. మరి మిగిలిన సంపద అంతా ఎక్కడుందని ప్రశ్నించారాయన. రాజకీయ పార్టీల్లో వాళ్లు మాత్రమే పోటీ చేయాలన్నట్లుగా కనిపించే వ్యక్తులు కొందరు ఉన్నారంటూ అగ్రవర్ణాలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. దేశంలో 22.28 శాతం జనాభా ఉన్న అగ్ర వర్ణాల ప్రజల దగ్గర దాదాపు డబుల్ అంటే దేశ సంపదలో 41 శాతం కలిగి ఉన్నారని చెప్పారు.