అసైన్డ్ భూములపై యజమానులకు హక్కులు కల్పించాలి

 అసైన్డ్ భూములపై యజమానులకు హక్కులు కల్పించాలి
  • తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: పీవోటీ(ప్రొహిబిషన్ అండ్ ట్రాన్స్ ఫర్స్) యాక్ట్–1977ను రద్దు చేసి అసైన్డ్ భూములపై యజమానులకు హక్కులు కల్పించాలని తెలంగాణ అసైన్డ్  ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.  మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు  శివయ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ  ప్రాంతాల నుంచి అసైన్డ్ భూముల యజమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం.. 16 లక్షల కుటుంబాలకు  24 లక్షల ఎకరాల భూమి ఇచ్చిందన్నారు.  ఈ భూమిపై యజమానులకు హక్కులు కల్పించాలని గత ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌ పేరుతో లాక్కున్న భూములను తిరిగి ఇప్పించి, తమకు హక్కులు కల్పించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ సలహాదారు సుదర్శన్ బాబు, ఉపాధ్యక్షుడు రుద్రం శేఖర్, సెక్రటరీ  బింగి రాములు, సర్దార్ శ్యాం పటేల్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.