రక్తంలోకి నేరుగా ఆక్సిజన్

రక్తంలోకి నేరుగా ఆక్సిజన్

కరోనా పేషెంట్‌‌కు ఎక్మో ట్రీట్‌‌మెంట్‌‌…

కోలుకున్న బాధితుడు

హైదరాబాద్, వెలుగు: క్రిటికల్ కండిషన్‌‌లో ఉన్న కరోనా పేషెంట్‌‌కు నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ ఎక్కించి డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. వరంగల్ జిల్లాకు చెందిన పీడియాట్రిషియన్‌‌, డాక్టర్ దయానంద్‌‌ సాగర్‌‌‌‌ గత నెల 14 న కేర్ బంజారా హాస్పిటల్‌‌లో అడ్మిట్ అయ్యారు . ఆయన లంగ్స్‌‌ ఇన్‌‌ఫెక్ట్ అవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆక్సిజన్ సపోర్ట్‌‌ ఇచ్చినా, వెంటి లేటర్ పైకి మార్చిన పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అంగీకారంతో ఎక్స్‌‌ట్రాకార్పోరి యల్ మెంబరేన్స్ ఆక్సిజనైజన్‌‌ (ఎక్మో) ద్వారా ట్రీట్ మెంట్ చేశారు. ఈ విధానంలో నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ ఎక్కించినట్టు చీఫ్ ఇంటెన్సివిస్ట్, డాక్టర్ పవన్‌‌కుమార్‌‌‌‌రెడ్డి తెలిపారు. శరీరం నుంచి రక్తాన్ని ఒక స్పెషల్ బైపాస్‌‌ సర్క్యూట్‌‌ సాయంతో బయటకు తీసుకొచ్చి, ఆక్సినైజేషన్ చేసి తిరిగి రోగికి ఎక్కిం చామన్నారు . 12 రోజుల తర్వాత దయానంద్ పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ నలుగురు కరోనా పేషెంట్లకు ఎక్మో పద్ధతి లో ట్రీట్‌‌మెంట్ ఇచ్చారని… సౌత్ ఇండియాలో ఎక్మో ట్రీట్‌‌మెంట్ ఇదే మొదటిదని ఆయన అన్నారు.