ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పదవికి పీసీ చాకో రాజీనామా

ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పదవికి పీసీ చాకో రాజీనామా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా  ఉన్న పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ కేవలం 4.26శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది. 2013లో ఢిల్లీలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి కారణం మాజీ సీఎం షీలా దీక్షిత్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చాకో. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ సొంతం చేసుకుందన్నారు. కోల్పోయిన ఓటు బ్యాంకును కాంగ్రెస్ తిరిగి సాధించలేకపోయిందన్నారు పీసీ చాకో.