గ్రామీణాభి వృద్ధి శాఖ స్పెషల్ కమి షనర్‌ గా శ్రీలక్ష్మి

గ్రామీణాభి వృద్ధి శాఖ స్పెషల్ కమి షనర్‌ గా శ్రీలక్ష్మి
  • స్పెషల్ కమిషనర్‌గా శ్రీలక్ష్మి
  •     ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2016 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పి. శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న శ్రీలక్ష్మిని, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ ఆధారంగా ప్రభుత్వం ఈ పోస్టులో నియమించింది. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారికంగాజీవో విడుదల చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న శ్రీలక్ష్మి, వెంటనే తన కొత్త బాధ్యతలను స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో సర్కారు ఆదేశించింది.